నేడు ప్రివిలేజ్ కమిటీ ఎదుటకు పోలీసు అధికారులు

పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ ఎదుట నేడు తెలంగాణ పోలీస్ అధికారులు హజరు కానున్నారు.

Update: 2022-02-03 02:21 GMT

పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ ఎదుట నేడు తెలంగాణ పోలీస్ అధికారులు హజరు కానున్నారు. పార్లమెంటు సబ్యుడు బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసు అధికారులను ప్రివిలేజ్ కమిటీ విచారణకు రమ్మని నోటీసులు జారీ చేసింది. దీంతో నేడు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకానున్నారు.

గత నెల రెండో తేదీన....
గత నెల 2 వతేదీ 317 జీవోకు నిరసనగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగారు. అయితే కార్యాలయం గేట్లు విరగకొట్టి పోలీసులు బండిసంజయ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై బండి సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో ప్రివిలేజ్ కమిటీకి అప్పగించారు.


Tags:    

Similar News