నేడు ఓయూకు రేవంత్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు

Update: 2023-03-24 02:47 GMT

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. యూనివర్సిటీలో నిరుద్యోగ దీక్షలో పాల్గొనాలని అక్కడి విద్యార్థి సంఘాల నేతలు కోరాయి. దీంతో నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. మరో వైపు పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

భారీ బందోబస్తు...
రేవంత్ రెడ్డిని కూడా పోలీసుల ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసే అవకాశముంది. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లకుండా రేవంత్ ను పోలీసులు అడ్డుకుంటారని సమాచారం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ దీక్షల సందర్భంగా పెద్దయెత్తున పోలీసు బందోబస్తు ఏ్పాటు చేశారు.


Tags:    

Similar News