Telangana : స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట

తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది

Update: 2025-09-25 06:39 GMT

తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టవద్దని సూచించింది. తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ వేశారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికలో తన పేరు తొలగించాలని హై కోర్టుకు విన్నవిస్తూ పిటిషన్ వేశారు.

కాళేశ్వరం కమిషన్ నివేదిక...
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా చేసిన స్మిత సబర్వాల్ నుకూడా కమిషన్ తప్పుపట్టింది. దీంతో ఆమె తన పేరును తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. మూడు బ్యారేజీల నిర్మాణంతో తనకు సంబంధం లేదని స్మితా సబర్వాల్‌ పిటీషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే ఫైళ్లను మాత్రమే తాను పరిశీలించానని, అందులో లోపాలను సరిచేయడం వరకే తన పాత్ర అని స్మితా సబర్వాల్ పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు స్మితాసబర్వాల్ కు ఊరట నిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News