Telangana : నేడు హైకోర్టులో రిజర్వేషన్ పై విచారణ
తెలంగాణ హైకోర్టులో నేడు బీసీ రిజర్వేషన్ల కు సంబంధించిన పిటీషన్ పై విచారణ జరగనుంది
తెలంగాణ హైకోర్టులో నేడు బీసీ రిజర్వేషన్ల కు సంబంధించిన పిటీషన్ పై విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ విచారించనున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు...
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు విడుల చేసే అవకాశముందని, పంచాయతీరాజ్ చట్టంలోని 285 ఎ ప్రకారం రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం ఉన్న విధంగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.