Telangana : టాలీవుడ్ నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది

Update: 2025-01-28 03:52 GMT

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. మైనర్లను రాత్రి పదకొండు గంటల తర్వాత థియేటర్లలోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పదహారు ఏళ్ల వయసున్న వారిని సెకండ్ షో సినిమాకు అనుమతించడంపై నిషేధం విధించింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంపై దాఖలయిన పిటీషన్ పై విచారించిన ఈ ఆదేశాలను జారీ చేసింది.

పిల్లలను...
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రీమియర్ షోలను రద్దు చేసిందని కూడా ప్రభుత్వం తరుపున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలును రాత్రి 11గంటల నుంచి ఉదయం11 గంటల వరకు అనుమతించొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇది సినీ నిర్మాతలకు షాక్ వంటిదే.


Tags:    

Similar News