Telangana : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సామాజిక దినోత్సవం ప్రతి ఏడాది జరపాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన సామాజిక దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికరతను కల్పించే లక్ష్యం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఫిబ్రవరి 4వ తేదీన...
ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వమిచంనున్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం ఏ మేరకు అమలు చేసింది? బీసీ రిజర్వేషన్లు, షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి సిఫార్సులను ఆమోదించిన విషయాలను ఈ సందర్భంగా అందరికీతెలయచేయడమే లక్ష్యంగా ఈరోజు నేతలు ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా నిర్వహించాలని ప్రభుత్వ కార్యక్రమంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.