Telangana : తెలంగాణ అన్నదాతలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-11-28 01:48 GMT

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరి రైతులకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నెలాఖరులోగా గత యాసంగి సీజన్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న సన్నవడ్డ బోనస్ డబ్బులు రైతులు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నవడ్లకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ను ప్రకటించింది.

యాసంగి బోనస్ డబ్బులు...
అయితే గత యాసంగి బోనస్ డబ్బులు ఇంత వరకూ జమ కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు సన్నబియ్యం బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరులోగా జమ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. వారి అకౌంట్లలో మరో రెండు రోజుల్లో డబ్బులు పడనున్నాయి.


Tags:    

Similar News