Breaking : Telangana : స్మితా సబర్వాల్ కు షాకిచ్చిన సర్కార్

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అప్రధాన్యత కలిగిన పోస్టుకు బదిలీ చేసింది

Update: 2025-04-27 13:19 GMT

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అప్రధాన్యత కలిగిన పోస్టుకు బదిలీ చేసింది. స్మితా సబర్వాల్ ను టూరిజం నుంచి బదిలీ చేసింది. ఫైనాన్స కమిలషన్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలి చేసింది. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇటీవల జారీ చేశారు. కంచె గచ్చి బౌలి భూముల విషయంలో జింకలు, జంతువుల ఫొటోలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ రీపోస్టు చేయడాన్ని తప్పుపడుతూ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చారు.

కంచె గచ్చి బౌలి భూముల విషయంలో...
కంచె గచ్చి బౌలి భూముల వద్ద జంతువులు ఇబ్బందులు పడుతున్నాయని ఏఐ ఆధారంగా కొందరు తప్పుడు ఫొటోలను పెట్టారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. కంచె గచ్చి బౌలి భూముల ప్రభుత్వ అధికారిణిగా ఉండి ఒక ఫేక్ పోస్టును రీట్వీట్ చేయడం పట్ల వివరణ ఇవ్వాలటూ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆమెను కోరారు. అయితే స్మితా సబర్వాల్ కూడా అదే స్థాయిలో స్పందించారు. ఈ ఫొటోను షేర్ చేసిన రెండు వేల మందికి నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.


Tags:    

Similar News