Telangana : సంక్రాంతి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది
school holidays in AP today
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సంక్రాంతి సెలవును ప్రకటించింది. ఈ సెలవులు అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆరు రోజుల పాటు...
సెలవుల సందర్భంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నెల 18వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు వీలుగా ఈ సెలవులను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ సెలవులు అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.