Telangana : నేడు తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు
తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి
తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం పదకొండు గంటలకు తన నివాసంలో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.
ఫలితాల కోసం...
గత నెల 29,30, మే 2,3,4వ తేదీల్లో ఎప్ సెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. జినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది, ఇంజనీరింగ్ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాశారు. వీరందరిలో ర్యాంకులను బట్టి ప్రవేశాలను కల్పించనున్నారు.