నేటి నుండి కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర

కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం

Update: 2023-10-28 03:48 GMT

కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రెండో విడత బస్సు యాత్ర కొనసాగుతుంది. రెండో విడత బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. నేడు డీకే శివకుమార్, ఎల్లుండి ఖర్గే పాల్గొననున్నారు. మొదటి రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండో రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో, మూడో రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో, నాలుగో రోజు నల్గొండ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగార్జున సాగర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో, ఐదో రోజు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాల్లో, ఆరో రోజు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది.

ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ సీనియర్ నాయకులు 6 రోజుల పాటు రాష్ట్రంలోని 17 ప్రముఖ అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఈ యాత్రలో సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని పార్టీ పత్రికా ప్రకటనలో తెలిపింది.


Tags:    

Similar News