Telagnana : నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఢిల్లీ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఢిల్లీ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా మంత్రి పదవుల భర్తీతో పాటు నామినేటెడ్ భర్తీ వంటి అంశాలపై చర్చించనున్నారు.
భారీ సభలకు...
మల్లికార్జున్ ఖర్గే తో పాటు కేసీ వేణుగోపాల్ ను కలిసి ఈ పదవుల పంపకాలపై చర్చించనున్నారు. దీంతో పాటు త్వరలో తాము అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి, తీసుకున్న నిర్ణయాలపై సూర్యాపేట, గజ్వేల్ లో ఈ నెలలో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం సభలకు వారిని ముఖ్య అతిధులుగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంక వాద్రేలను ఆహ్వానించనున్నారు.