Telangana : తెలంగాణ డీజీపీ నియామకానికి తుది రూపు

తెలంగాణలో కొత్త డీజీపీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది

Update: 2026-03-19 02:26 GMT

తెలంగాణలో కొత్త డీజీపీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రానికి మూడో పూర్తి కాలపు డీజీపీని నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. యూపీఎస్సీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల తుది జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాలో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వానికి పంపింది.

ఈ ముగ్గురు అధికారులు...
1991 బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన ఐబీ స్పెషల్ డైరెక్టర్, 1994 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉన్నారు. వీరిలో ఒకరిని హెడ్‌ ఆఫ్‌ ది పోలీస్‌ ఫోర్స్‌గా నియమించనున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో ఒకరిని తెలంగాణ తదుపరి డీజీపీగా ప్రభుత్వం నియమించనుంది.


Tags:    

Similar News