Telangana : అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు.

Update: 2025-03-08 06:10 GMT

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను మంజూరు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. దీర్ఘకాలంగా అమలు చేయకుండా నిలిచిపోయిన వాటిని పరిష్కరించాలని కోరారు.

రైల్వే ప్రాజెక్టులను...
రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసి తెలంగాణను మరింత ఆదుకోవాలంటూ వారు కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు ఈ మేరకు అనేక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భగా ఆయన సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలసిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ లు ఉన్నారు.


Tags:    

Similar News