Telangana : నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి

Update: 2025-04-30 02:56 GMT

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదోతరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఐదు లక్షలమంది వరకూ...
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకూ పదోతరగతి పరీక్షలు తెలంగాణలో జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఫలితాలను results.bse.telangana.gov.in, bse.telangana.gov.in లేదా manabai.co.in వెబ్ సైట్ లో చూసుకునే వీలుంది. ఈరోజు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా అధికారులు ప్రకటించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News