పది, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణలో పదో తరగతి, ఇంటర్‌మీడియట్ ఫలితాలు వారం రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Update: 2023-05-07 04:51 GMT

తెలంగాణలో పదో తరగతి, ఇంటర్‌మీడియట్ ఫలితాలు వారం రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయిందని, త్వరలోనే రిజల్ట్ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఫలితాలను విడుదల చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని, వారం రోజుల్లోనే పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేస్తామని చెబుతున్నారు.

రిజల్ట్ కోసం...
మే 10 లేదా మే 12వ తేదీన పదో తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశముందని తెలిసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకూ పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌లో 5,05 లక్షల మంది, పదో తరగతి పరీక్షకు 7.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీలో పదోతరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రిజల్ట్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News