Revanth Reddy : కిషన్ రెడ్డికి రేవంత్ తొమ్మిది పేజీల లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తొమ్మిది పేజీల లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదని, కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయడం లేదని లేఖలో ప్రస్తావించారు.
మెట్రో రైలు విస్తరణకు...
మెట్రో రైలు విస్తరణ పనులకు కేంద్రం సహకరించడం లేదని కిషన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కీలక ప్రాజెక్టుల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందన్న ఆయన అందువల్ల మెట్రో విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. మెట్రో విస్తరణపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు.