Revanth Reddy : నేడు కామారెడ్డికి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల క్లౌడ్ బరస్ట్ తో కామారెడ్డి జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధితులను పరామర్శిస్తారు. అధికారులతో సమావేశం నిర్వహించి జరిగిన నష్టంతో పాటు వరద తర్వాత జరుగుతున్న పనులపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.
వరద బాధితులకు...
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ కు చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగపల్లి కుర్దు రోడ్లు భవనాల శాఖ వంతెనను పరిశఈలిస్తారు. బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంటపొలాలను రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. అనంతరం కామారెడ్డి మున్సిపాలిలీలో దెబ్బతిన్న రోడ్లతో పాటు అత్యధికంగా ప్రభావితమైన జీఆర్ కాలనీని ముఖ్యమంత్రి సందర్శిస్తారు.