Revanth Reddy : నేడు కొండారెడ్డి పల్లికి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన స్వగ్రామమైన కొండారెడ్డి పల్లికి వెళ్లనున్నారు. దసరా వేడుకల్లో పాల్గొననున్నారు

Update: 2025-10-02 03:01 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన స్వగ్రామమైన కొండారెడ్డి పల్లికి వెళ్లనున్నారు. సొంతూరు కొండారెడ్డిపల్లిలో రేవంత్‌ రెడ్డి దసరా వేడుకలు జరుపుకోనున్నారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలసి ముఖ్యమంత్రి దసరా పండగను జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రి కొండారెడ్డి పల్లికి వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

స్వగ్రామంలో దసరా పండగ...
ఈరోజు కొండారెడ్డి పల్లిలో దసరా వేడుకల్లో పాల్గొనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కొడంగల్‌ నియోజకవర్గానికి వెళతారు. అక్కడ జరిగే దసరా వేడుకల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండారెడ్డిపల్లిలోనూ, కొడంగల్ నియోజకవర్గంలోనూ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News