Revanth Reddy : నేడు ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు
revanth reddy
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో త్వరలో జాతీయ పార్టీ నేతల ప్రచారంతో పాటు రాష్ట్ర నాయకుల ప్రచారంపై కూడా ఆయన నేతలతో చర్చించనున్నారు.
నగరంలో రోడ్ షోలు...
రాబోయే ఎన్నికల్లో కనీసం పథ్నాలుగు స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రయత్నం చేసేందుకు అన్ని రకాల వ్యూహాలను రచించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతూ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేస్తామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పనున్నారు. ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి, ఎల్.బినగర్ లో నేడు రోడ్ షోలు నిర్వహించనున్నారు.