Revanth Reddy: మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ క్లారిటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై కొంత క్లారిటీ ఇచ్చారు

Update: 2025-06-11 07:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై కొంత క్లారిటీ ఇచ్చారు. తన వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలకు మాత్రమే కేటాయిస్తామన్నారు. పాత మంత్రుల శాఖలను మార్చడం లేదని ఆయన తెలిపారు.

తాను ఢిల్లీకి వచ్చింది...
సాధారణ పరిపాలన శాఖ, సాంఘిక సంక్షేమం, హోం, మున్సిపల్,క్రీడలు, విద్య,సంక్షేమ వంటివి ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి. తాను అధికారంలో ఉండగా కేసీఆర్ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం లేదన్నారు. తాము ఢిల్లీకి వచ్చింది కేవలం కులగణనకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు మాత్రమేనని ఆయన తెలిపారు. తాను అధికారంలో ఉన్ననాళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ కాంగ్రెస్ లో చేరరని, కేసీఆర్ కుటుంబం తెలంగాణకు శత్రువులని కూడా చెప్పారు.


Tags:    

Similar News