Revanth Reddy : జగన్ తో జత కట్టి తెలంగాణకు ద్రోహం చేసింది నువ్వు కాదా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-02-21 12:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు జగన్ ను ఇంటికి పిలిపించుకుని పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టింది నీవు కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణకు రావాల్సిన నీటిని దోచుకుని వెళుతున్నా మాట్లాడంది ఎవరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నామని, రాజీ పడకుండా వ్యవహరిస్తున్నా తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

తనపై కోపంతోనే...
తనపై కోపంతోనే పాలమూరుపై కేసీఆర్ కక్ష కట్టారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది ఎవరంటూ నిప్పులు చెరిగారు. లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావని, వేల కోట్లు మింగావని అన్నారు. కాళేశ్వరం నేడు కుప్పకూలడం నిజం కాదా? అని ప్రశ్నించారు. లగచర్లలో గొడవలు పెట్టాలని చూశారని, కలెక్టర్ ను కూడా కొట్టాలని చూశారని, తమ ప్రాంత యువతకు ఉద్యోగాలు రావద్దా అంటూ కేసీఆర్ ను నిలదీశారు. తనను కాదని, తప్పులు చేస్తున్న నీ అల్లుడు, కొడుకును కొట్టాలని కేసీఆర్ కు సూచించారు. ఐదేళ్లలో తాను చెప్పిన హామీలను అమలు చేసే బాధ్యత తనపై ఉందన్నారు. తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.


Tags:    

Similar News