బెజవాడకు సీఎం కేసీఆర్ ... నిజమేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. ఆయన దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడకు వెళుతున్నారు

Update: 2022-09-16 08:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. ఆయన దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడకు వెళుతున్నారు. సీపీఐ జాతీయ మహాసభల్లో హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సీపీఐ జాతీయ మహాసభలు వచ్చే నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ విజయవాడలో జరగనున్నాయి. ఈ సమావేశాలకు జాతీయ స్థాయి నేతలతో పాటు పలువురు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు.

ముగ్గురు సీఎంలు...
అందులో భాగంగా తెలంగాణ, కేరళ, బీహార్ ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు 20 దేశాలకు చెందిన కమ్యునిస్టు నేతలు కూడా హాజరుకానున్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలసి ప్రయాణం సాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో మొదలు పెట్టి సాధారణ ఎన్నికల వరకూ ఈ పొత్తును కొనసాగించాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. అందువల్లనే కేసీఆర్ బెజవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభలకు వెళ్లనున్నారని తెలిసింది.


Tags:    

Similar News