నేడు తెలంగాణ సబ్ కమిటీ సమావేశం
నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది
నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఆదాయపు పన్ను పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించనున్నారు.
ఆదాయాన్ని పెంచడం కోసం...
ముఖ్యంగా ప్రబుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఈ కమిటీ చర్చించి నిర్ణయాలను తీసుకోనుంది. ప్రజలపై భారం మోపకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించనుంది. ఈ సబ్ కమిటీ ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. వీటిలో కొన్నింటిని ప్రభుత్వం అమలు చేసే అవకాశముంది.