తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2025-07-25 05:19 GMT

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నరు.

ఢిల్లీలోనే మంత్రులు...
ఏఐసీసీ ఓబీసీ మీటింగ్ లో ముగ్గురు మంత్రులు పాల్గొనేందుకు ఢిల్లీకి వెళుతున్నారు. ఓబీసీ సమావేశంలో పాల్గొనేందుకు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్లారు. ఐదుగురు మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 28వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News