నేడు దీక్షకు దిగనున్న బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరుద్యోగ దీక్ష చేయన్నారు.

Update: 2021-12-27 02:18 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరుద్యోగ దీక్ష చేయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్లు ఇస్తామంటూ ఎప్పటికప్పుడు యువతను మభ్యపెడుతుందని, తద్వారా యువత ఆత్మహత్యలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయాయని బండి సంజయ్ తెలిపారు. నిరుద్యోగులకు అండగా తాను ఈరోజు దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.

నిరుద్యోగులకు...
అయితే తొలుత ఇందిరా పార్క్ వద్ద బండి సంజయ్ దీక్ష చేయాలనుకున్నారు. కానీ పోలీసులు కోవిడ్ నిబంధనల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదు. దీంతో బీజేపీ పార్టీ కార్యాలయంలోనే దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ బండి సంజయ్ దీక్ష కొనసాగనుంది.


Tags:    

Similar News