నేటితో ముగియనున్న బండి సంజయ్ యాత్ర

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది

Update: 2022-09-22 03:26 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సాయంత్రం పెద్ద అంబర్‌పేటలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ ముగింపు సభకు కేంద్ర సహాయం మంత్రి నిరంజన్ జ్యోతి ముఖ్యఅతిధిగా వస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది.

నగరంలోనే...
నాలుగో విడత పాదయాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్ల మేర నడిచారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే నాలుగో విడత పాదయాత్ర సాగింది. సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్పీ నగర్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది. నగరంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన పాదయాత్రలో ముందుకు సాగారు. ఈ యాత్ర ముగింపు సభను భారీ ఎత్తున జరపాలని నిర్ణయించారు.


Tags:    

Similar News