బండి సంజయ్ పై దాడి కేసులో.... వారికి నోటీసులు

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

Update: 2022-01-22 05:53 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించిన కొద్దిరోజుల్లోనే కమిటీ స్పందించింది. లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ అందుకు బాధ్యులైన వారికి నోటీసులు పంపింది. బండి సంజయ్ తనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ దాడి చేశారని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

పోలీసులకు....
ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల జీవోకు నిరసనగా కరీంనగర్ లోని తన కార్యాలయంలో బండి సంజయ్ జాగరణ దీక్షకు దిగారు. అయితే పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా తోపులాట జరిగింది. గ్యాస్ కట్టర్లు పెట్టి కార్యాలయం తలుపులను తొలగించి తన హక్కులకు పోలీసులు భంగం కల్గించారని బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీ ముందు తన వాదనను వినిపించారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ, జగిత్యాల, డీఎస్పీ, కరీనంగర్ ఇన్ స్పెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీన తమ ఎదుగట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.


Tags:    

Similar News