Breaking : పార్టీఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
group 1 mains exam
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్ని రోజులు నిర్ణయానికి సమయం తీసుకుంటారని ప్రశ్నించింది. తెలంగాణ శానసభ సెక్రటరీపై అసహనం వ్యక్తం చేసింది. కొంత సమయం కావాలని ముకుల్ రోహత్గీ న్యాయస్థానాన్ని అభ్యర్థించగా ఎంత సమయం కావాలి? ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అని ప్రశ్నించింది.
గడువు పూర్తయ్యే వరకా?
అంతేకాదు శాసనసభ గడువు ముగిసే వరకూ ఆగుతారా? అని కూడా ధర్మాసనం నిలదీసింది. మహరాష్ట్రలో మాదిరిగా ఎన్నికలు వచ్చేంత వరకూ నిర్ణయాన్ని తీసుకోరా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్ ను అడిగి నిర్ణయం చెబుతామని ముకుల్ రోహత్గీ తెలిపారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి పది మంది సభ్యులు కాంగ్రెస్ లోకి మారడంపై దాఖలయిన పిటీషన్ విచారణలో సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలుచేసింది.