Weather Report : దిత్వా.. ఇంకా ఉంది..నేడు కూడా జోరు వానలు
దిత్వా తుపాను ప్రభావం నేడు కూడా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది
దిత్వా తుపాను ప్రభావం నేడు కూడా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. వాయుగుండం అల్పపీడనంగా మారింది. అయినా తీరం దాటలేదు. దిత్వా తుపాను తీరం దాటదని ముందుగానే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తీరం వెంట పయనిస్తుందని తెలిపారు. అ ప్రకారమే తీరం వెంట వెళుతున్న సమయంలో మరో ఇరవై నాలుగు గంటల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని సూచించింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ జిల్లాలకు అలెర్ట్...
దిత్వా తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వానలు పడుతున్నాయి. నేడు కూడా భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశముందని చెప్పింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడిచింది. ప్రకాశం, అనంతపుంర, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో చలిగాలులు...
తెలంగాణలోనూ దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగిలిన చోట్ల పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరొకవైపు తెలంగాణలో చలితీవ్రత ఎక్కువవుతుందని చెప్పింది. ఇప్పటికే పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించింది.