Revanth Reddy : అరగంట సేపు రేవంత్ ప్రధానితో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8,9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ఆహ్వానం అందించారు. రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీని రేవంత్ కలిసి గ్లోబల్ సమ్మిట్ కు రావాలని కోరారు.
గ్లోబల్ సమ్మిట్ కు రావాలని...
ప్రధానితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అరగంటకు పైగానే సాగింది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ ను కూడా కలిశారు. వారితో పాటు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి ఆయనను గ్లోబల్ సమ్మిట్ కు రావాలని కోరనున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఈ సమ్మిట్ కు రావాలని కోరనున్నారు.