Telangana : నేటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ

ఈరోజు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

Update: 2025-12-03 03:16 GMT

ఈరోజు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటి వరకూ రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలకు సంబధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం పూర్తయింది. మూడో విడత ఎన్నికలు తెలంగాణలోని 182 మండలాల్లోని 4,159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నేటి నుంచి ఈ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారు.

డిసెంబరు 17న ఎన్నికలు...
డిసెంబరు 5వ తేదీన నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబరు 6వ తేదీన మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను పరిశీలిస్తారు. డిసెంబరు 9వ తేదీన నామినేషన్లను ఉపసంహరిస్తారు. డిసెంబరు 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి.


Tags:    

Similar News