Danam Nagender : రాజీనామాపై దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-12-05 05:58 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామాకు సిద్ధమని దానం నాగేందర్ తెలిపారు. రాజీనామాలు చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని, ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్తేమీ కాదని దానం నాగేందర్ అన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశిస్తే...
అయితే అనర్హత వేటుపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని, స్పీకర్ ఎదుట తన వాదనలను వినిపిస్తానని దానం నాగేందర్ చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని అన్నారు. తాను దేనికీ భయపడేవాడిని కానని, రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనని దానం నాగేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు పాటు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.


Tags:    

Similar News