శ్రీతేజ ఆరోగ్యంపై స్పందించిన దిల్ రాజు
శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు
సంధ్య థియేటర్ లో పుష్ప మూవీ విడుదల సందర్భంగా గాయపడిన శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. శ్రీ తేజ ని పూర్తిస్థాయిలో ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేయడం జరిగిందన్న దిల్ రాజు వడ్డీ రూపంలో వస్తున్న డబ్బులను ప్రతినెల శ్రీ తేజ తండ్రికి వచ్చేలా చేసామని చెప్పారు. ఆస్పత్రిలో దాదాపు 70 లక్షల రూపాయలు చికిత్స కోసం అందించామని చెప్పారు.
రెండు కోట్లు డిపాజిట్ చేశాం...
రిహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చును కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారన్న దిల్ రాజు శ్రీ తేజ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగా కుదుటపడుతుందన్నారు. అల్లు అర్జున్ టీం చాలావరకు బాగా రెస్పాండ్ అయిందని ఈ సందర్భంగా శ్రీ తేజ తండ్రి తెలిపారు. ఇప్పటివరకు అన్ని విధాల అల్లు టీం మమ్మల్ని ఆదుకుందన్న ఆయన మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఉందని చెప్పారు. అన్ని విషయాలు దిల్ రాజు తోటి మాట్లాడం జరిగిందని, దిల్ రాజు కూడా అన్ని విధాల సహాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.