ఇద్దరు భార్యలతో నామినేషన్లు

సర్పంచ్ పదవికి నామినేషన్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

Update: 2025-12-03 14:40 GMT

సర్పంచ్ పదవికి నామినేషన్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నవంబర్‌ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు వేయించారు. నామినేషన్‌ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్రూ్కటినీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో రెండో భార్యతో మరో నామినేషన్‌ వేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఈ ఇద్దరే పోటీలో ఉన్నారు. వీరిలో ఒకరు నామినేషన్‌ ఉపసంహరించుకుంటే సర్పంచ్‌ పదవి ఏకగ్రీవంకానుంది.

Tags:    

Similar News