Revanth Reddy : నేడు ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-12-04 03:26 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి వరసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుండటంతో ప్రజాపాలన కు సంబంధించిన విషయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, హుస్నాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో...
ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెల్లనున్ునారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. దీంతో పాటు అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి భూమి పూజను నిర్వహించనున్నారు. మరికొన్నింటిని ప్రారంభిస్తారు. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు.


Tags:    

Similar News