యూపీ రిజల్ట్ తెలంగాణలో రిపీట్

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

Update: 2022-03-10 11:58 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రేపే ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనని మాట ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ ఖతం అన్న వారికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక చెంపపెట్టు అని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో....
డబుల్ ఇంజిన్ గ్రోత్ తెలంగాణ ఎన్నికలకూ వర్తిస్తుందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఒకే పార్టీ ఉంటే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యనే పోటీ ఉందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే విజయమని, ఇది రాసిపెట్టుకోండని బండి సంజయ్ అన్నారు.


Tags:    

Similar News