Telangana : భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు.. కొన్ని రైళ్లు దారి మళ్లింపు

తెలంగాణలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు

Update: 2025-08-28 02:42 GMT

తెలంగాణలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షం వల్ల పలు చోట్ల రైల్వే ట్రాక్ లు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. వరద నీరు తగ్గిన తర్వాత మాత్రమే ఆ ప్రాంతం వైపు అనుమతిస్తామని రైల్వే శాఖ అధికారులు వివరించారు. ముఖ్యంగా నిజామాబాద్ - పెద్దపల్లి బైపాస్ - కాజీపేట / కాజీపేట టౌన్ మార్గం నుంచి వెళ్లే పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి - సికింద్రాబాద్ మధ్య పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది.

దారి మళ్లించిన రైళ్ల వివరాలివే
1) 17057 దేవగిరి ఎక్స్ ప్రెస్ ముంబయి నుండి లింగంపల్లి ( వచ్చే మార్గంలో )
2) 17058 దేవగిరి ఎక్స్ ప్రెస్ లింగంపల్లి నుండి ముంబయి ( వెళ్లే మార్గంలో )
3) 17606 భగత్ - కి - కోటి ( జోధ్ పూర్ ) నుండి కాచిగూడ ఎక్స్ ప్రెస్
4) 16734 ఓఖా నుండి రామేశ్వరం వీక్లీ ఎక్స్ ప్రెస్
5) 12787 నర్సాపూర్ నుండి నాగర్ సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( ఎగువ మార్గంలో )
6) 12788 నాగర్ సోల్ నుండి నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( దిగువ మార్గంలో )
7) 17405 తిరుపతి నుండి ఆదిలాబాదు కృష్ణా ఎక్స్ ప్రెస్
8) 12720 హైదరాబాదు నాంపల్లి నుండి జైపూర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్


Tags:    

Similar News