JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌ కాపీయింగ్‌

ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి, సికింద్రాబాద్ కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు వెళ్తూ.. తనిఖీల్లో బయటపడకుండా..

Update: 2023-06-06 08:29 GMT

smart copying in jee advanced exam

హైదరాబాద్ లో ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ ను గుర్తించారు. స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడిన కీలక నిందితుడు చింతపల్లి చైతన్య కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీలోని ఓ కార్పొరేట్ కాలేజీ హాస్టల్ లో ఉంటున్న నలుగురు విద్యార్థులు ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి, సికింద్రాబాద్ కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు వెళ్తూ.. తనిఖీల్లో బయటపడకుండా స్మార్ట్ ఫోన్లు వెంట తీసుకెళ్లారు. సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎన్ పీఐటీ కళాశాలలో పరీక్ష రాస్తోన్న చైతన్య కృష్ణ.. గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించి తాను రాసిన సమాధానాలను స్క్రీన్ షాట్స్ తీసి నలుగురికీ చెందిన వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.

చైతన్య చేస్తున్న పనిని గమనించిన ఇన్విజిలేటర్.. స్మార్ట్ కాపీయింగ్ జరిగినట్లు గుర్తించారు. చైతన్య కృష్ణపై మొండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన చైతన్య కృష్ణ ఎస్ఎస్ సీ లో 800 మార్కులకు గాను 600, ఇంటర్ లో 940 మార్కులు సాధించాడు. మెరిట్ విద్యార్థి అయిన చైతన్య స్నేహితుల కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు.


Tags:    

Similar News