అనాథలు, నిరుద్యోగ యువతకోసం ఉచిత నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం

యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ నిర్మించిన ఈ కేంద్రం వరంగల్‌లోని మేడిపల్లి-రాంపూర్, ఇతర ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో సహాయపడుతుంది.

Update: 2021-12-23 07:30 GMT

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనాథలు, ఇతర నిరుద్యోగ యువతకు ఉపాధిని అందించడానికి వరంగల్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. అనాథలకు మార్గనిర్దేశం చేయడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ నిర్మించిన ఈ కేంద్రం వరంగల్‌లోని మేడిపల్లి-రాంపూర్, ఇతర ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో సహాయపడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా యశోద కేంద్రాల ద్వారా దాదాపు 6,000 మంది అనాథలకు ఉపాధి లభించినట్లు అధికారులు తెలిపారు. "ప్రభుత్వం గొప్ప పని చేస్తున్నప్పుడు, మేము అనాథలు, నిరుద్యోగులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి ఏర్పాట్లు చేస్తున్నాము. అందుకే ఈ ఉచిత కేంద్రాన్ని నిర్మించాం' అని ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోరుకంటి దేవేందర్‌రావు చెప్పుకొచ్చారు. ఎంతో మంది నిరుద్యోగులు పలు కోర్సులు ఇక్కడ నేర్చుకుని నిష్ణాతులు అవ్వొచ్చని.. అలాంటి వారికి ఉపాధి సులువుగా దక్కుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News