ఢిల్లీ పెద్దలతో షర్మిల భేటీ.. పార్టీ విలీనం లాంఛనమేనా..?

తాను తెలంగాణనే బిడ్డనని, ఇక్కడి బిడ్డనే, ఇక్కడి కోడలినే భావించండి.. ఇక్కడి నుంచే నా రాజకీయం ఉంటుంది.. వైఎస్‌ బిడ్డగా..

Update: 2023-09-01 05:38 GMT

తాను తెలంగాణనే బిడ్డనని, ఇక్కడి బిడ్డనే, ఇక్కడి కోడలినే భావించండి.. ఇక్కడి నుంచే నా రాజకీయం ఉంటుంది.. వైఎస్‌ బిడ్డగా తెలంగాణ సమాజం ఆశీర్వదించాలి.. అంటూ వైఎస్ షర్మిల కోరుతోంది. అయితే ఆమె నోటి వెంట తెలంగాణ అనే పదం తప్ప ఏపీ అని ఏనాడు కూడా రావడం లేదు. ఏపీ రాజకీయాల గురించి ఎలాంటి అంశాలు మాట్లాడటం లేదు. కేవలం తెలంగాణ రాజకీయాల గురించి, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానంటూ ముందుకు సాగుతోంది. అయితే కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఇక లాంఛనంగానే మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సుధీర్ఘ భేటీ అనంతరం షర్మిల హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ విలీనం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసమే చేస్తానని, తెలంగాణ ప్రజల కోసమే నా తాపత్రయం అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని, పార్టీని విలీనంపై త్వరలోనే వివరాలు తెలియజేస్తానని అన్నారు. రాహుల్, సోనియా తనతో ఆప్యాయంగా మాట్లాడారంటూ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందించిందనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని బట్టి.. విలీనంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

షర్మిల విలీనం.. అటు కాంగ్రెస్ లోనూ, సొంత పార్టీలోనూ చిచ్చు రేపింది. షర్మిల ఢిల్లీ పర్యటన అనంతరం అధికార పార్టీ ప్రతినిధులు రాజీనామా ప్రకటించారు. షర్మిల నిర్ణయాన్ని నాయకులు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనాన్ని ఆ పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ను జైలుకు పంపిన పార్టీలోకి వైఎస్‌ఆర్‌టీపీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు. అయితే, కొండా రాఘవరెడ్డికి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. కొండా కొంతకాలమే మా పార్టీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆయన పార్టీ కోసం ఎక్కువ పనిచేయలేదని.. ప్రస్తుతం పార్టీలో లేరంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో విలీనానికి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

Tags:    

Similar News