Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు నిజామాబాద్ వాసుల మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మరణించారు.

Update: 2025-09-04 04:06 GMT

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మరణించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం హుమ్నాపూర్ నుంచి పదిహేను మంది నిన్న ఉదయం మూడు కార్లలో బయలుదేరి వెళ్లారు.

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా...
స్వామి వారిని దర్శించుకుని సాయంత్రం నాలుగు గంటల సమయంలో తిరుగు ప్రయాణ సమయంలో మహారాష్ట్రలోని బోకర్ తాలూకా నందా గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న బుల్లిరాజు, సునీత, వాణిలు మరణించారు. వీరిలో బుల్లిరాజు, సునీత భార్యాభర్తలు. డ్రైవర్ కు కూడా గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ఒక ఆసుపత్రికతి తరలించారు. మృతదేహాలను స్థానిక పోలీసులు బోకర్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


Tags:    

Similar News