చిక్కుల్లో ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది.
smita sabharwal, senior IAS officer, trouble, high court
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ఇటీవల దివ్యాంగుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ లుగా దివ్యాంగులకు రిజర్వేషన్లను తీసి వేయాలన్నారు. వారుప్రజాసమస్యలపై వెంటనే స్పందించే అవకాశముండదని ఆమె అభిప్రాయపడ్డారు.
చేసిన ట్వీట్...
ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని ఆమె ట్వీట్ చేశారు. దీనిపై అనేక మంది అభ్యంతరం తెలిపారు. కొందరు ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌కు నేరుగా కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే చివరకు ఆమె ట్వీట్ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో న్యాయస్థానం వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.