Smitha Sabharwal : స్మితా సబర్వాల్ కెలుక్కుంటూనే ఉంటుంటే.. అధికారంలో ఉన్న వాళ్లకు మంటెక్కదా?

తెలంగాణలోని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రోజుకొక ట్వీట్ చేస్తూ వివాదానికి కేంద్రంగా మారుతున్నారు

Update: 2025-04-30 07:35 GMT

ఐఏఎస్ లు అధికారులుగా తమ పని తాము చేసుకుని వెళ్లాలి. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లిపోవడమో.. కేంద్ర సర్వీసులకు వెళ్లడమో చేయాలి. అంతే తప్పించి ఇక్కడే ఉండి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం ఐఏఎస్ లకు తగదు. అసలువారి పని కాదు. తమకు ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేయాలి. అంతే తప్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేసినా, కామెంట్లు పెట్టినా అది అధికారంలో ఉన్నోళ్లకు కాలుతుంది. ఆ మాత్రం తెలియని వారు ఐఏఎస్ లు ఎలా అయ్యారన్నదే ఇక్కడ ప్రశ్న. తెలంగాణలోని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా ఈ కోవకు చెందిన వారే.

మంచి అధికారే అయినా...
ఆమె మంచి అధికారి కావచ్చు. సమర్థవంతమైన ఆఫీసర్ అని అనుకోవచ్చు. తనకు ఏ శాఖ అప్పగించినా దానిని ఎక్కడికో తీసుకెళ్లగలనన్న ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రాధాన్యతలు, దాని అవసరాలు గుర్తించకుండా సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్ట్ లు పెట్టడం అస్సలు సరికాదు. స్మితా సబర్వాల్ తొలి నుంచి అంతే. బీఆర్ఎస్ అధికారంలో ఉండగాముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేవారు. అక్కడ నీటి పారుదల ప్రాజెక్టుల అంశాన్నిపరిశీలించేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్మితా సబర్వాల్ కు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. కేసీఆర్ కూడా ఆమెకు అంతే ప్రయారిటీ ఇచ్చారు. అందుకే అప్పుడు ఆమెకు ప్రభుత్వంలో ఎలాంటి లొసుగులు కనిపించలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత...
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగ్గరగా ఉన్న ఐఏఎస్ లను దూరం పెట్టారు. అది ఎక్కడైనా సహజమే. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను కూడా ప్రకృతి వైపరీత్యాల సంస్థకు మార్చేశారు. ఆయన మారుమాట్లాడకుండా తన పని తాను చేసుకు వెళుతున్నారు. కానీస్మితా సబర్వాల్ మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సోషల్ మీడియా పోస్టులను షేర్ చేయడమే కాకుండా, తనకునోటీసులు ఇచ్చిన పోలీసులను కూడా ఈ పోస్టును రీ ట్వీట్ చేసిన రెండు వేల మందికి కూడా నోటీసులు ఇస్తారా? అంటూ ఎక్స్ లో ప్రకటించడం అధికారపార్టీ నేతలకు సహజంగానే మండిపోతుంది.
తాజా ట్వీట్ తో...
అందుకే తాజాగా ఆమెను టూరిజం శాఖ నుంచి బదిలీ చేసి అప్రధాన్య పోస్టుకు బదిలీ చేశారు. దీంతో ఆమె మళ్లీ ఊరుకోలేదు. దీనిపై కూడా పోస్టు పెట్టి కెలుక్కున్నారు. మిగిలిన ఐఏఎస్ అధికారులు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ప్రభుత్వ ప్రయారిటీ అని భావించి మారు మాట్లాడకుండా వెళుతుంటే స్మితా సబర్వాల్ మాత్రం తానేదో రాష్ట్రాన్ని ఉద్ధరించానంటూ మరోసారి ఎక్స్ లో పోస్టు చేయడం మరోసారి వివాదమయింది. ఆమె ఐఏఎస్ అధికారి అన్న విషయం మర్చిపోయి ఈ రకమైన ట్వీట్లు చేయడంపై సహచర ఐఏఎస్ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏమి అనుకున్నాస్మితా సబర్వాల్ మాత్రం వెరవకుండా పోస్టులు పెట్టడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News