ఆగని హింస.. ట్రాక్ పైనే ఆందోళనకారులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రక్తసిక్తంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు.

Update: 2022-06-17 06:37 GMT

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రక్తసిక్తంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థిితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఆర్మీ అభ్యర్థులు ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ముట్టడించారు. అందింది అందినట్లు వారు ధ్వంసం చేశారు. దాదాపు మూడుగంటల పాటు బీభత్సం సృష్టించారు.

మూడు రైళ్లను...
ఆందోళనకారులు అజంతా, ఈస్ట్‌కోస్ట్, ఎంఎంటీఎస్ రైళ్లకు నిప్పుపెట్టారు. ఇవి తగులబడ్డాయి. ఆందోళనకారులు రెచ్చిపోతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఛాతీలోకి బుల్లెట్ దిగడంతో ఒక ఆందోళనకారుడి పరిస్థిితి విషమంగా ఉంది. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. ఇంకా ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ పైనే బైఠాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఆందోళనకారుల దాడితో రైళ్లన్నంటినీ రద్దు చేశారు. సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లన్నంటినీ అధికారులు రద్దు చేశారు.


Tags:    

Similar News