Telangana : రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కలిశారు

Update: 2025-10-31 06:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కలిశారు. తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి సాయం చేస్తానని బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై రేవంత్‌ రెడ్డి తీసుకుంటున్న చర్యలను సల్మాన్‌ ప్రశంసించారు.

తన వంతు సాయాన్ని...
తెలంగాణ రాష్ట్రం శక్తివంతమైన ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు తన వంతు సాయం అందిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ప్రగతిని ప్రస్తావిస్తూ, తెలంగాణ వేగంగా ఎదుగుతోందని అభినందించారు. సల్మాన్ ఖాన్ ను కలవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.


Tags:    

Similar News