Telangana : ఆర్టీసీ సమ్మె వాయిదా... వాయిదా తాత్కాలికమేనన్న సంఘాలు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు ఫలమంతమయ్యాయి

Update: 2025-05-06 11:48 GMT

Telangana rtc

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు ఫలమంతమయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్ లతో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి వాటి పరిష్కారానికి సూచనలను చేయనుంది.

వారం రోజుల్లో నివేదిక...
వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ త్రీమెన్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు, కార్మికులపై పనిభారం, డిపోల్లో నెలకొన్న సమస్యలు, ఒత్తిళ్ల వంటి వాటిపై పరిష్కారాలను ఉద్యోగ సంఘాలతో చర్చించి పరిష్కారాలను ప్రభుత్వానికి సూచించింది. అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కారం లభిస్తుందన్న మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సంఘాలు తాము రేపటి నుంచి తలపెట్టిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే మూడు గంటలపాటు జరిగిన ఈ చర్చలు కొంత వరకూ ఫలించాయని, అయితే తమ సమ్మె వాయిదా తాత్కాలికమేనని సంఘాల నేతలు ప్రకటించాయి.


Tags:    

Similar News