Telangana : నేడు తెలంగాణలో దేవేంద్ర ఫడ్నవిస్ పర్యటన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలంగాణలో నేడు పర్యటించనున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలంగాణలో నేడు పర్యటించనున్నారు. ఈరోజు మంచిర్యాల, కొమురం భీ జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. మంచిర్యాలలో రోడ్ షో ను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చేయనున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రసంగించనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవేంద్ర ఫడ్నవిస్ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రోడ్ షోలు, బహిరంగ సభల్లో దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొననుందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా జనసమీకరణ కూడా పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కూడా పాల్గొంటారు.