బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న దానిపై స్పీకర్ మరికొంత సమయం కోరారు. మున్సిపల్ ఎన్నికలున్నందున తమకు కొంత సమయం కావాలని స్పీకర్ తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. దీంతో సుప్రీంకోర్టు మూడు వారాలకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
మూడు వారాల్లోగా...
మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే థిక్కార చర్యలుంటాయని చెప్పింది. పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై ఇప్పటి వరకూ ఎనిమిది మందిపై విచారణ ముగిసి తీర్పు కూడా వెల్లడయింది. కేవలం ఇద్దరి ఎమ్మెల్యేల విషయంలోనే పెండింగ్ లో ఉంది. అయితే ఈ మూడు వారాల్లో స్పీకర్ గడ్డం ప్రసాదరావు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.