Telangana : గజ్వేల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
గజ్వేల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.
గజ్వేల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. గజ్వేల్ లోని ఆర్ అండ్ కాలనీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మల్లన్న సాగర్ నిర్వాసితులు తమ గ్రామంలోకి బీఆర్ఎస్ నేతలు రావద్దంటూ ప్రచారాన్ని అడ్డుకున్నారు. తమకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ గ్రామానికి హరీశ్ రావు కూడా రావడానికి వీల్లేదనితెలిపారు.
మల్లన్న సాగర్ నిర్వాసితులకు...
మల్లన్న సాగర్ నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అండగా నిలిచాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలను పంపించి వేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.